తొలి ఐవీఎఫ్‌ విఫలమైందా? వదిలేయండి! ఈసారి విజయం సాధించవచ్చు!
 • 8మందిలో ఒకరికి మానసిక వేదనే.. అందులో ఒకరి ఆవేదనే ఈ కథనం!
  నెగిటివ్ మెడికల్ రిపోర్ట్ కారణంగా పిండం మార్పిడి ఆగిపోయింది. వారికి ఉన్న రెండు అవకాశాలు చేజారిపోయాయి. ఆమె గర్భ సంచిలోకి పిండం వస్తుందని మూడు రోజులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ దివ్యమైన అనుభూతి తనకు దక్కలేదు. కొద్దివారాలుగా వారు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. పిండాన్ని బిడ్డగా మలచలేదన్న బాధ, ఆవేదన, ఆందోళనతో ఆమె మనసు తీవ్రంగా గాయపడింది. సహజంగానే ఇలాంటి దుస్థితి ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు.
 • pgs
 • వాస్తవానికి ఆమె ఈ పద్ధతిని అంత సులభమైనదిగా భావించలేదు. ఐవీఎఫ్‌లో ఉండే కష్టనష్టాలు, సాధకబాధకాలు తెలుసు. మొదటిసారే వందశాతం సక్సస్ అవుతానని కూడా ఆమె భావించలేదు.. కానీ రెండోసారి కూడా ఇలా విఫలమవుతుందని మాత్రం ఊహించకలేకపోయారామె. ఖచ్చితంగా నిలుపుకోగలుగుతామని అనుకున్నా కానీ, తీరని శోకాన్ని మిగిల్చింది. ఫెయిల్‌ అవడానికి కారణం తెలియదు కానీ... ఎంతో వేదన చెందాల్సి వచ్చింది. ఆ బాధ అనుభవించినవారికి తెలుస్తుంది. ఇది కొందరు చదవుతూ ఉండొచ్చు. అందుకే ఈ వివరాలను అందిస్తున్నాం.
 • పిండం బదిలీ సాధ్యం కాదని వైద్యులు చెప్పినప్పుడు చాలా బాధపడడం సహజం. బిడ్డల జననం దైవాధీనం అని తాత్విక చింతన నిజం కావచ్చు. కానీ అర్ధం చేసుకునే స్థితిలో అందరూ ఉండరు, విలపిస్తారు, వారిని వారే నిందించుకున్నారు. కోపం తెచ్చుకుంటారు. జీవితమే నాశనం అయిందన్న భావన అణువణువూ వారికి వ్యాపిస్తుందిది. ప్రతి ఉదయం శోకంతోనే జీవితం మొదలుపెడతారు. ఎందుకంటే దీని కోసం వారాల కొద్దీ జీవితాన్ని అంకితమివ్వడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. కొంతకాలం తర్వాత సముదాయించుకుని బయటప్రపంచంలో అడుగుపెట్టడం మొదలుపెట్టాలి. సూపర్‌ మార్కెట్‌‌కో, ఇతర పనులతో వెళ్లినప్పుడు నిండు గర్బిణీలను చూసినప్పుడు మళ్లీ జ్ఞాపకాలు వెంటాడతాయి. బిడ్డలు లేరన్న విషయం వేధిస్తుంది. వారు ఎంత అదృష్ట వంతులు అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో వారిపై వారికే కోపం వస్తుంది. వారు తమ గర్బాన్ని చూసుకుంటూ ఉంటే లోలోపలే రగిలిపోతుంటారు. పుట్టాల్సిన బిడ్డలు పిండం దశలోనే ఆగిపోతే ఎవరూ పట్టించుకోలేదన్న ఆవేదన.. ఈ ప్రపంచం తమ బాధను అర్ధం చేసుకోదా అనుకుంటారు.
 • ఇలాంటి వారు చాలామంది ఉంటారు. మన రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఆవేదన తెలుసుకుందాం. వసంత అనే మహిళ(వ్యక్తిగత భద్రత కోసం పేరు మార్చడం జరిగింది) ఆవేదనను ఆమె మాటలలోనే తెలుసుకుందాం.
  ''నాకు తెలుసు. నా కోపం సరైంది కాదని. విచక్షణ కోల్పోకూడదని. కానీ మనసులో ఈ ఫీలింగ్స్‌ ఉండేవి. ఇతర గర్భిణీలపై నాకు ఎలాంటి కోపం, ప్రతీకారం లేదు. మూడేళ్ల పాటు బిడ్డను కనేందుకు చేసిన పోరాటం ఫలించలేదన్న ఆగ్రహం మాత్రమే ఇందులో ఉంది. బిడ్డ కనాలని చేసిన ప్రయత్నంలో నా జీవనశైలిమార్చుకున్నాను. హానికరమైన పద్దతి అని తెలిసినా.. కొన్ని రకాలు చికిత్సలు తీసుకున్నాను. ఎన్నిచేసినా నా కుటుంబంలో కొత్త వెలుగులు నింపలేకపోయాను. పిండం నా గర్బసంచిలోకి బదిలీ కాలేదు. సంతోషం పంచాల్సిన ఐవీఎఫ్‌ ప్రక్రియ విషాదంగా ముగిసింది. అందుకే ఇతరులను చూసినప్పుడు నా ముఖంలో ఆందోళన కనిపించేది. ప్రశాంతంగా ఉండలేకపోయాను.''
 • "అయితే మరికొద్ది గంటల్లోనే నా మనసు మళ్లీ రోటీన్‌ పనిమీదకు మళ్లేది. అయితే బాధను మరిచిపోతున్న భావన ఎంతోసేపు నిలిచేది కాదు. ఆఫీసు సహచరులతో టీ రూంలోనూ పిల్లల చుట్టూనే చర్చ. ఇతరులతో వాళ్లవాళ్ల పిల్లల గురించి చర్చల్లో మునిగిపోవాల్సి వచ్చేది. కొందరైతే మీరు లక్కీ... పిల్లలు లేరు మీకు స్వేచ్ఛ ఉందంటూ అనేవాళ్లు. కానీ ఓవైపు బాధ నన్ను పీడించేది. ముందుగా చెప్పినట్టు నా జీవితం రోజురోజుకు మరింత విషమంగా తయారుయింది. మానసికంగా సతమతమయ్యాను. కొద్ది కాలానికి అర్ధమయింది... ఐవీఎఫ్‌ ఓ సరదా పార్టీ కాదని... ఇది ఛేదించాల్సిన పెద్ద విషయమని తెలిసింది. అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలుసుకోవడానికి సమయం కూడా పట్టింది. చివరకు కష్టమే అయినా.. ఇష్టంగా కొన్ని పద్దతలతో నన్ను నేనే మార్చుకోవడం ద్వారా బయటపడ్డాను. అనుకున్నది సాధించాను.
 • "సాధించడం కోసం కొన్ని కఠిన పద్దతులు అవలంబించాను. ఎంత బాధ కలిగినా నిబ్బరంగా ఉండేదాన్ని. ఐవీఎఫ్‌ లో భాగంగా శరీరంలోని వివిధ భాగాల్లో తలెత్తె బాధను ఓర్చుకోగలిగాను. పోషకాలకు సంబంధించి అలసందలతో వంట నేర్చుకున్నాను. నా అలవాట్లతో శరరీం కూడా మందులకు సహజంగానే స్పందించడం మొదలైంది. కెఫన్‌, అల్కాహాల్ వంటివి లేకుండా జాగ్రత్తపడ్డాను. సాధారణ మరియు... పరిణితి చెందిన సమయంలోనే మూడు పిండాలను తీసుకోవడం జరిగింది. మూడింటిలో రెండు గుడ్లు పిండాలుగా మారాయి. వైద్యులు సైమన్‌ తన అత్యుత్తమ ప్రదర్శనలో రికార్డు సమయంలో ప్రక్రియ పూర్తిచేశారు. మెడికల్ టీంపై నేను పూర్తిగా విశ్వాసం ఉంచాను. ఎప్పటికప్పుడు నా శరీరీం స్పందించే తీరుపై ఫోటోలతో నాకు నమ్మకం కలిగించారు. క్లిష్ట పరిస్థితుల్లో స్నేహితులు, బంధువులు ఆన్‌ లైన్‌ కమ్యూనిటీ సహకారం మరువలేనిది. నిజంగా బంధువులు, స్నేహితుల విలువ అప్పుడే తెలిసింది. వారి వల్లే ఇలా ప్రశాంతంగా ఉండగలిగాను. పరిస్థితులను అధిగమించగలిగాను."
 • "ఐవీఎఫ్‌ ప్రయత్నాలు విఫలం కావడం, మిస్‌ కేరాజ్‌, ఇతర కారణాలతో గర్బం కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. వీరంతా మనసుపెట్టి ఆలోచించడం లేదు. ఇది పూర్తిగా ఎవరికి వారు సొంతంగా అవగాహనతో పరిస్థితులను ఎదుర్కోవాల్సిన వ్యవహారం. బయటకు చెబితే బాధ పెరుగుతుంది... కానీ పరిష్కారం దొరకదు. ఇన్‌ ఫెర్టిలిటీ గురించి పత్రికలో నేను రాయడానికి ప్రధాన కారణం కూడా ఇదే. స్వీయ అనుభవంతో అవగాహన కల్పించడం బాధ్యతగా భావించాను. కొందరు బయటకు చెప్పుకోలేని అంశాల గురించి కూడా తెలియజేయాలనుకున్నాను. మీకు కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఐదేళ్లు అయినా ఇంకా పిల్లలు లేరని అడుగుతారు. రోడ్డుమీద పిల్లలతో తల్లి నడుస్తుంటే.. ఎంత అదృష్టవంతురాలని వినిపిస్తుంటాయి. పిల్లల పేర్లు ఏం పెట్టాలి.. రూమ్‌ ఎలా సిద్ధం చేయాలంటూ మాటలు వినిపిస్తాయి. పెళ్లి అయిన 9 నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చారని వార్తలు కనిపిస్తాయి. ఇవన్నీ మనకు బాధ కలిగిస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎదుర్కొన్న సందర్భాలే ఇవి. కానీ వాటిని కేర్‌ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా ధైర్యంగా ఎదుర్కొంటే మీకు మీరుగా సన్నద్ధమైతే సాధిస్తారు."
 • ఏదో ఒక రోజు మీకు బిడ్డ పుడుతుంది. సహజపద్ధతి, ఐవీఎఫ్‌, దత్తత, ఎగ్ డోనర్‌, స్మెర్మ్‌ డోనర్‌ లేదా సరోగసి ఏదో ఒక రూపంలో బిడ్డకు తల్లి అవుతారు. మీ బిడ్డను చూసుకున్నప్పుడు మీ కళ్లలో ఆనందం ఉండాలి. మీ బిడ్డ కళ్లు కూడా మీపై అంతే తీక్షణంగా ఉంటాయి. డిఎన్‌ఏ గురించి మీరు ఆలోచిస్తే ఆనందం ఆవిరవుతుంది. బిడ్డను చూసినప్పుడు మీలో సంతోషం ఉండాలి తప్ప.. బాధ కాదు.. ఇదే నిజం... ఇదే మీకు స్పెషల్.. ఎందుకంటే ఎన్నో అడ్డంకులు దాటి మీరు తల్లి హోదాకు వచ్చారు కదా.
contact