సంతాన సౌభాగ్యం కోసం చక్కని మార్గం ఐవీఎఫ్
 • ప్రపంచవ్యాప్తంగా సంతానప్రాప్తి లేని వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో #webeatinfertility కు దాదాపు 42వేల రెట్లు స్పందన పెరుగుతోందని తెలుసా? దీనికి సంబంధించి కొన్ని అవగాహన అవసరం. నేను కూడా తెలుసుకున్నాను.
 • ఇన్ ఫెర్టిలిటీతో పోరాడుతున్నారా? అయితే దీనిపై ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరముంది.
 • pgs
 • బిడ్డను కనేందుకు మీరు పోరాడుతుండొచ్చు. ఎన్నో ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. మీ ఆశలు ఇప్పటికీ నెరవేరకపోయిండొచ్చు. ఎంతో కోల్పోయామన్న భావనలో మీరుంటారు. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నారా? రెండేళ్ల క్రితం ఐవీఎఫ్ ద్వారానే కూతురుకి జన్మనిచ్చాను. కానీ కూతురు పుట్టకముందు నేను కూడా చాలా పోరాడాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది.. ప్రయత్నించి ప్రయత్నించి చివరకు సాధించాను. కానీ ఈ ప్రయాణంలో నిత్యం పోరాటం చేశాను. అలసటగా ఉండేది. ఎంతకాలంరా బాబూ ఆ బాధ అనుకునేదాన్ని. ఏమీ అర్ధమయ్యేది కాదు. భాగా నీరసించిపోయేదాన్ని.. ఒక్కోసారి ఒంట్లో అవయవాలు కూడా పనిచేసేవి కావు. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకునేదాన్ని. కుటుంబం నామీద ఆధారపడి ఉందన్న విషయం నా కష్టాన్ని మరిచేలా చేసింది. ఇదే నాకు వెయ్యి ఎనుగుల బలానిచ్చింది. నన్ను నేను మరింతగా ఇష్టపడుతూ వచ్చాను. ఈ పోరాటంలో శక్తిని కోల్పోయినట్టు అనిపించిన ప్రతిసారీ మరింత స్ట్రాంగ్ గా తయారయ్యాను. చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. కఠిన పరిస్థితుల్లో కూడా స్థిమితంగా, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాను. ఇందుకోసం మానసిక ప్రశాంతత లభించే ప్రదేశాల్లో ఎక్కువగా ఉండే దాన్ని.
 • ఇన్ ఫెర్టిలిటీని ఓ పోరాటంగా భావించలేదు. నాకు నేనుగా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్దమయ్యేదాన్ని దీంతో ప్రతి ఉదయం ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అనిపించేది. ఇది నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.
ఇన్ ఫెర్టిలిటీ అధిగమించడం నిజంగా గొప్ప విషయం: ప్రశాంతత లభించింది
 • మీరు ఇప్పటికీ దీనిపై పోరాడుతుండొచ్చు. కానీ ఇదేమీ యుద్ధం కాదు. సున్నితమైన, దృఢమైన, ప్రశాంతమైన, సాహసోపేతమైన మరియు శక్తివంతమైన వ్యక్తులుగా మిమ్మల్ని మీరు తెలుసుకొండి. ఈ పదాలు వినడానికి బాగున్నాయని అనుకుంటున్నారా? కానీ నిజమేనని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. మీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు. మీరు అనుకుంటున్న మీ గొప్పతనం గురించి అర్ధం చేసుకోవడానికి కొంత ప్రయత్నం కూడా జరగాలి. ప్రశాంతంగా ఉండడం అంటే మీ కడుపులో బిడ్డ సాధారణంగానే పెరుగుదల ఉందని అర్ధం కాదు. మీరు ఇన్ ఫెర్టిలిటీ అధిగమించడానికి పోరాటం మాత్రం ఆపకూడదని గుర్తుంచుకోండి. ఈ పరుగుపందెం కొనసాగించాల్సిందే. కాకపోతే వాటివల్ల మీరు పడే బాధ నుంచి ముఖ్యంగా నొప్పి, ఆందోళన, అసహనం, బాధనుంచి ఉపశమనం పొంది ప్రశాంతంగా, ద్రుడంగా ఉండగలుగుతారు.
 • అయితే మీలోని మార్పును ఆహ్వానించాలంటే కొద్దిగా కష్టపడాలి. ఇందుకోసం వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఈరోజునే మంచి ముహూర్తంగా భావించండి.
సెల్ఫ్ లవ్ ఎక్సర్‌సైజ్
 • మీరు అమితంగా ఇష్టపడే 10 అంశాలను నోట్ చేసుకోండి. వాటిని ఎలా పాటించాలో రాసుకోండి. డైరీలో జాగ్రత్తగా సమయపాలనను చేసుకోండి. ముందుగా వారంలో ఎంతసమయం కేటాయించగలరో చూసుకోండి.
 • ఇప్పుడు మీలో మీకు నచ్చిన 5 అంశాల గురించి రాసుకోండి. అంటే మీ జీవితంలో ఈ క్షణంలో నచ్చిన ఏవైనా 5 అంశాలు గురించి వెంటనే నోట్ చేసుకోండి. కాదు, లేదు అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొహమాటం కోసం చేయలేని పనులు మానుకోండి. మీకు కష్టంగా అనిపించింది ఏదైనా సరే ఎవరితో అయినా కాదని చెప్పండి. అదే సమయంలో స్నేహపూర్వక సంబంధాలు చెడగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. ప్రశాంతంగా, సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. ఇది ఇన్ ఫెర్టిలిటీ పోరాటంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడంగానే భావించండి.
 • ఇక మీ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడంపైనా దృష్టి పెట్టండి. అవసరమైన షోషక ఆహారం తీసుకోవాలి. యోగా లేదా, ఫుట్ మసాజ్ చేసుకోండి(అత్యంత ముఖ్యమైనది, మంచిది). మీరు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే.. శారీరకంగా అంత ఆరోగ్యంగా ఉంటారని గుర్తుంచుకోండి.
 • మరికొన్ని సెల్ఫ్‌కేర్ చిట్కాలు తెలుసుకోవాలని ఉందా? త్వరలోనే మీకు షేర్ చేస్తాను. గురువారం కమ్యూనిటిలో వీటి గురించి మరింతగా చర్చిస్తాను.. మరింత నీరసించిపోకుండా.. ఇన్ ఫెర్టిలిటీపై పోరాటం చేసేందుకు, ధ్రుడంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తెలుసుకుందాం.. అప్పటివరకూ మీరు స్ట్రాంగ్ గా ఉండేందుకు చేసే ప్రయత్నాలను ఆపకండి.
 • నాణ్యమైన, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హాస్పిటల్‌లోఇందుకోసం మీరు తగిన సహాయం పొందవచ్చు. అక్కడి వైద్యులు మీకు తగిన సూచనలు అందించి, విజయావకాశాలను పెంపొందిస్తారు, మీకు మానసికంగా కూడా ధైర్యం నింపుకునేలా చేయడం ఈ రంగంలోని వైద్యుల ప్రత్యేకత.
contact